త్వరలో డీఎస్సి-2008 బాధితులకు కాంట్రాక్టు టీచర్లుగా అవకాశం

జీకే జాబ్స్ తెలుగు, హైదరాబాద్: ఉమ్మడి రాష్ట్రంలో నిర్వహించిన డీఎస్సి-2008లో నష్టపోయిన 2,367 మంది అభ్యర్థులను కాంట్రాక్టు టీచర్లుగా నియమించేందుకు అవసరమైన ప్రక్రియను పూర్తి చేసేందుకు పాఠశాల విద్యాశాఖ చర్యలు ముమ్మరం చేసింది. ఆనాడు నష్టపోయినవారు తమ పేర్లు నమోదు చేసుకోవాలని సెప్టెంబర్ నెలాఖరులో విద్యాశాఖ కోరింది. 

telangana-dsc-2008-gk-jobs-telugu

ఈ క్రమంలో ఆయా ధ్రువపత్రాలను పరిశీలించి వారికీ కొలువులు ఇచ్చేందుకు అధికారులు సిద్ధమయ్యారు. Sangareddy, Nalgonda, Rangareddy, Hanumakonda, Khammam, Nizamabad, Adilabad, Karimnagar, Mahbubnagar జిల్లాల్లో బాధితులున్నారు. ఒక్కో జిల్లాకు ఒక సీనియర్ అధికారిని పరిశీలకునిగా నియమించారు. ఈ నెల 8లోపు ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు.

దీనికి సంబందించిన సమాచారం ఈనాడు పత్రికలో రావడం జరిగింది.

telangana-dsc-2008