నేడు తెలంగాణ టెట్ నోటిఫికేషన్ 4th Nov 2024

Tet-Notification-2024

తెలంగాణలో నిర్వహించే ఉపాధ్యాయ అర్హత పరీక్ష "TET" నోటిఫికేషన్ ఈ సోమవారం జారీ కానుంది. అందుకు పాఠశాల విద్యాశాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది.

ఏటా రెండుసార్లు టెట్ నిర్వహిస్తామని ప్రభుత్వం గతంలో పేర్కొంది. ఈ సంవత్సరం మే 20వ తేదీ నుంచి జూన్ 2 వరకు ఆన్లైన్ పరీక్షలు నిర్వహిం చిన సంగతి తెలిసిందే. రెండో టెట్ కు నవంబరులో నోటిఫికేషన్ జారీ చేసి జనవరిలో పరీక్షలు జరుపుతామని గత ఆగస్టులో జాబ్ క్యాలెండర్ విడుదల సమయంలో ప్రభుత్వం వెల్లడించింది. 

ఈక్రమంలో ఈ సోమవారం రోజున నోటిఫికేషన్ ను జారీ చేసేందుకు పాఠశాల విద్యాశాఖ అధికారులు సిద్ధం అయ్యారు. 2025 జనవరిలో ఆన్లైన్లో పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. 

మునుపటి "మే" నెలలో నిర్వహించినటువంటి టెట్ పరీక్షలను సుమారుగా (2.35) లక్షల మంది వరకు రాశారు. వారిలో 1.09 లక్షల మంది పాసయ్యారు. ఈసారి నిర్వహించిన డీఎస్సీ కూడా పూర్తయినందున టెట్ పరీక్ష రాసే వారి సంఖ్య స్వల్పంగా తగ్గవచ్చని అధికారులు భావిస్తున్నారు. 

ఆన్లైన్ పరీక్షలైనందున కనీసం వారం పది రోజులపాటు స్లాట్లు దొరకాల్సి ఉంటుంది. అందువల్ల సంక్రాంతి లోపా? ఆ తర్వాతా? అన్నది ఇప్పుడే చెప్పలేమని ఓ అధికారి వ్యాఖ్యానించారు. 

Official Website: Click Here